ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సభ్య దేశాలు
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సభ్య దేశాలు
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత దేశం యొక్క పదవీ కాలం రెండు సంవత్సరముల (2021-2022). దీనిని 1 జనవరి 2021 నుంచి మొదలుపెట్టింది. ప్రపంచ శాంతి, భద్రతలను కాపాడే అత్యున్నత స్థానాన్ని భారత దేశం దక్కించుకుంది. అయితే భారత్‌కు చోటు దక్కడం ఇది ఎనిమిదోసారి. ఇటీవల ఐదు తాత్కాలిక సభ్యదేశాల కోసం జరిగిన ఎన్నిక పోటీల్లో భారత దేశం 184 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించింది. 2021 ఆగస్టు నెలలో, 2022లో మరో నెల పాటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష పదవిలో భారత దేశం కొనసాగనుంది.
15 సభ్య దేశాలు
— ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 15 దేశాలు సభ్యులుగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి.
— ఎస్తోనియా, నైజర్, సెయింట్ విన్సెంట్ గ్రెనెడైన్స్, ట్యునీషియా, వియత్నాం తాత్కాలిక సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి.
— 1 జనవరి 2021 నుంచి భారత్, మెక్సికో, ఐర్లాండ్, నార్వే, కెన్యా దేశాలు కొత్తగా చేరాయి.