గోల్కొండ కోట, నగరం
గోల్కొండ కోట, నగరం
తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదు నగరములో గోల్కొండ కోట, నగరం వున్నది. హైదరాబాదు నగరమునకు 11 కి.మీ. దూరములో గోల్కొండ కోట, నగరం ఉంది. గోల్కొండ కోట, నగరం యొక్క విస్తీర్ణం మొత్తం 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద గోల్కొండ కోటను కట్టారు. గోల్కొండ కోట రక్షణార్ధం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. గోల్కొండ కోటను కాకతీయులు 1083 A. D. నుండి 1323 A. D. వరకు పాలించారు. మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ముసునూరి కమ్మ నాయకులు ఓడించి g 1336 A. D.లో గోల్కొండ కోటను తిరిగి సాధించారు. కమ్మ మహారాజు ముసునూరి కాపయ నాయకుడు గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షాకు 1364 A. D.లో వశము చేశాడు. గోల్కొండ కోట బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1365-1512) ఉన్నది. 1512 A. D. తరువాత ముస్లిము సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడింది.
చరిత్ర
“గొల్ల కొండ” నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందింది. దీని వెనుక ఒక విశేషమైన కథనం ఉంది. 1143లో mangalavaaram అనే రాళ్ళ గుట్ట పైన ఒక దేవతా విగ్రహము గొడ్లకాపరికి కనిపించింది. గోల్కొండ కోటను పాలించే కాకతీయులకు ఈ విషయం తెలియజేయబడింది. ఆ పవిత్ర స్థలములో వెంటనే మట్టి కట్టడమును నిర్మించారు. ముసునూరి కమ్మరాజులకు, కాకతీయులకు గోల్కొండ ఓరుగంటి సామ్రాజ్యములో ముఖ్యమైన కోట. 1323లో గోల్కొండ కోటను మొట్ట మొదట సారిగా ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలుఘ్ ఖాన్ వశమయ్యింది. ముసునూరి కమ్మరాజుల విప్లవము తరువాత ఓరుగల్లుతో బాటు గోల్కొండ కోటను కూడా విముక్తము చేయబడింది. గుల్బర్గ్గా రాజధానిగా వెలసిన బహమనీ రాజ్యమునకు ముసునూరి కమ్మరాజులకి 1347లో పెక్కు సంఘర్షణలు జరిగాయి[1]. మహమ్మద్ షా కాలములో కౌలాస్ కోటను తిరిగి సాధించుటకు ముసునూరి కాపయ నాయకుడు తన కొడుకు వినాయక దేవ్ ని పంపాడు. ఈ ప్రయత్నములో వినాయక దేవ్ ఓడిపోయాడు. పారశీక అశ్వముల కొనుగోలు విషయములో 1361లో తగాదా వచ్చింది. దాని ఫలితముగా మహమ్మద్ షా బేలం పట్టణముపై దాడి చేసి వినాయక దేవ్ ని బంధించి ఆతనిని ఘాతుకముగా వధించాడు[2]. మహమ్మద్ షా సైనికులను ఓరుగంటి వీరులు గుల్బర్గాకు తిరిగిపోవు దారిలో మట్టుబెట్టారు. తీవ్రముగా సుల్తాను కూడా గాయపడ్డాడు. కోపంతో సుల్తాను తన సైన్యమును తీసుకొని కాపయ నాయకుడుపై యుద్ధమునకు సిద్దపడ్డాడు. విజయనగర సహాయము ఓరుగంటికి అందలేదు. ఢిల్లీ సుల్తాను సహాయము కాపయ నాయకుడు కోరాడు. ఢిల్లీ సుల్తాను తోటి మహమ్మదీయునిపై యుద్ధము చేయుటకు ఇష్టపడలేదు. మహమ్మద్ షాతో బలహీనపడిన కాపయ నాయకుడు సంధిచేసుకున్నాడు. 300ఏనుగులు, 200 గుర్రాలు, 33 లక్షల రూప్యములతో బాటు గోల్కొండ కోటను పూర్తిగా వదులుకున్నాడు. గోల్కొండ కోటకు అజీమ్ హుమయూన్ అధిపతిగా చేశాడు. తరువాత షా గుల్బర్గాకు మరలాడు. హిందువులనుండి గోల్కొండ కోట 1364లో చేజారి పోయింది. తరువాత నవాబులు పరిపాలించారు.